ఓ ఆర్టీసీలో బస్సులో మంటలు చెలరాగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుండి దిగిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ ఎసీ బస్సు భద్రాచలం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకునేసరికి బస్సులో మంటలు చెలరేగాయి.
అయితే మంటలను గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.