RBI Update: కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డుకి నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను మళ్లీ నామినేట్ చేసింది. సతీష్ కాశీనాథ్ మరాఠే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది.. పార్ట్ టైమ్, నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. గురుమూర్తి, సతీష్ కాశీనాథ్‌లు నాలుగేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారని, ఈ నియమకం గురువారం (నిన్నటి) నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయ్యర్, సచిన్‌లు కూడా నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని, అయితే వాళ్లు ప్రస్తుతం ఉన్న పదవుల కాలం సెప్టెంబర్ 18న ముగిశాక ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
‘గో’ ఫ్యూచర్ ప్లాన్
బ్రాండెడ్ ఉమెన్స్ బోటమ్ వేర్ మార్కెట్‌లో దాదాపు 8 శాతం వాటా కలిగిన గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్.. విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఏటా దాదాపు 120 నుంచి 130 వరకు కొత్త స్టోర్లను ప్రారంభించాలని భావిస్తోంది. గో కలర్స్ అనే బ్రాండ్ ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్న ఈ సంస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 24 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ప్రకటించింది.
Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
‘పవర్’ పెరిగింది
జులైలో దేశవ్యాప్తంగా విద్యుత్ వాడకం పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లకి 17 శాతం అధికంగా బొగ్గును సరఫరా చేయాల్సి వచ్చింది. డిమాండ్‌కి తగ్గట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 58 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వినియోగించారు. గత నెలలో బొగ్గు ఉత్పత్తి కూడా 11 శాతానికి పైగా పెరగటం విశేషం. 2022 జులైలో 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా ఈసారి 60 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది.
8 ఏళ్లలో డబుల్
2 వేల 30 నాటికి అంటే రానున్న ఎనిమిదేళ్లలో ఇండియా బ్రిటన్ మధ్య వాణిజ్యం రెట్టింపుకానుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, టెక్నాలజీలో పెట్టుబడులు, గ్లోబల్ సప్లై చైన్‌లో మార్పులు చేర్పులు, సులభతర వ్యాపార వాతావరణం ఇరు దేశాల వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయి. బ్రిటన్ మీట్స్ ఇండియా రిపోర్ట్-2022లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇండియా రికార్డ్
ప్రపంచంలోనే అత్యధిక డైలీ స్టార్టప్స్ రికగ్నైజింగ్ రేట్ కలిగిన దేశంగా ఇండియా ఘనత సాధించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న మన దేశంలో ప్రస్తుతం 75 వేల స్టార్టప్స్ ఉండటం విశేషం. మొదటి 10 వేల స్టార్టప్‌లకు ప్రభుత్వ గుర్తింపు రావటానికి ఏకంగా 808 రోజులు పట్టగా చివరి 10 వేల స్టార్టప్‌లకు కేవలం 156 రోజుల్లోనే రికగ్నిషన్ వచ్చింది. దీని ప్రకారం రోజుకి సగటున 80కి పైగా గుర్తింపు పొందాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు.
సబ్సిడీకి నో
886 మిలియన్ డాలర్ల సబ్సిడీ ఇవ్వాలన్న స్పేస్ఎక్స్ విజ్ఞప్తిని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ తిరస్కరించింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ సంస్థకి అమెరికాలోని దాదాపు ఆరున్నర లక్షల ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు నిధుల అవసరం ఏర్పడింది. స్పేస్‌ఎక్స్‌కి అనుబంధంగా ఉన్న స్టార్‌లింక్ సంస్థ ఈ సర్వీసులపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం వల్లే సబ్సిడీని నిరాకరించినట్లు ఎఫ్‌సీసీ పేర్కొంది.