తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్… జారీ చేసిన నోటీసులపై తాజాగా రాపిడో సంస్థ దిగివచ్చింది. మొదట్లో తగ్గేదే లేదట్లు గా వ్యవహరించిన రాపిడో సంస్థ… మొత్తానికి… సజ్జనార్ దెబ్బకు ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకుని యాడ్ లో చిత్రీ కరించిన సన్ని వేశాలను తొలగిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది రాపిడో సంస్థ. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది రాపిడో.
అంతే కాదు.. తెలంగాణ ఆర్టీసీ కి రాపిడో క్షమాపణలు చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేసింది రాపిడో. కాగా… రెండు రోజుల కింద యాడ్ లోని ఆర్టీసీ బస్సు సన్నివేశాన్ని తొలగించాలని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్… బన్నీ, రాపిడో సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నోటీసులు జారీ చేసిన రెండు రోజులకు దిగివచ్చింది రాపిడో.