కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు ప్రజానికంపై మరో పిడుగు పడింది. తమిళనాడులో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెన్నైలో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్లపై లోతులో నీళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా పలు లోకల్ రైళ్లను రద్ధు చేశారు. లోకల్ రైళ్లు రద్ధు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
Read: విశాఖ ఉక్కు ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు: పవన్
పెట్రోల్ ధరల పెరుగుదలతో ప్రజలు సొంతవాహనాలను చాలా వరకు పక్కనపెట్టి లోకల్ రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. కాగా,భారీ వర్షాల కారణంగా రైళ్లు రద్ధు కావడంతో సామాన్యులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ తెలియజేయడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే తమిళనాడులోని అనేక జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2015 తరువాత శనివారం రాత్రి భారీ వర్షం కురిసిందని వాతారవణ శాఖ తెలియజేసింది. ప్రభుత్వ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే వరదసహాకయ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.