దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను రామ్నాత్ కోవింద్‌కు వివరించి.. ఆ ఘటనపై మెమోరాండం సమర్పించనుంది రాహుల్ గాంధీ టీమ్.. ఏడుగురు సభ్యులు ప్రతినిధి బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉండగా… రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలవనుంది కాంగ్రెస్ నేతల బృందం.