టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కాన్పూర్ టెస్టు కోసం స్పోర్టింగ్ పిచ్ తయారుచేసిన పిచ్ క్యూరేటర్ శివకుమార్ బృందానికి రూ.35వేలు బహుమతిగా ఇచ్చాడు. ఓ జట్టుకు అనుకూలంగా లేకుండా మంచి పిచ్ తయారుచేసినందుకు పిచ్ క్యూరేటర్, గ్రౌండ్‌మెన్‌కు రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. స్పోర్టింగ్ పిచ్ వల్లే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య టెస్టు డ్రాగా ముగిసినా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత వినోదం అందింది.
Read Also: దేవుడా.. ఇడ్లీలో కప్ప కళేబరం.. ఎక్కడో తెలుసా..?
కాగా రాహుల్ ద్రవిడ్ పిచ్ క్యూరేటర్‌కు డబ్బులు ఇచ్చిన విషయాన్ని స్వయంగా ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం ధృవీకరించింది. సొంతగడ్డపై స్పిన్ పిచ్‌లే కాకుండా పేస్ పిచ్‌లు కూడా తయారుచేయాలని రాహుల్ ద్రవిడ్ సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ అంటే స్పిన్ పిచ్ వేసి ప్రత్యర్థిని బోల్తా కొట్టించేవారు. తద్వారా టెస్టు మ్యాచ్ మూడు లేదా నాలుగు రోజుల్లోనే ఏకపక్షంగా ముగిసేది. కానీ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్ కావడంతో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. క్రికెట్ ఆడే సమయంలో జెంటిల్‌మన్ గేమ్‌తో క్రికెట్‌కు వన్నె తెచ్చిన రాహుల్ ద్రవిడ్… కోచ్‌గా కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తుండటం అభినందనీయం.