బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ దక్షిణ కొరియా యాక్షన్ చిత్రం ‘ది అవుట్‌లాస్’కు హిందీ రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిషా పటానితో పాటు జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా నటించారు. ఈ చిత్రం జీ5, జీఫ్లెక్స్ లో పే పర్ వ్యూ బేస్ తో పాటు అన్ని డిటిహెచ్ ఆపరేటర్ల దగ్గర లభిస్తుంది. సినిమాకు సల్మాన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా భిన్నమైన స్పందన వస్తోంది. సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది, రొటీన్ అంటూ రివ్యూలు వస్తున్నాయి. కొంతమందైతే ఏకంగా సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరికీ షాకిస్తూ ‘రాధే’ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 4.2+ మిలియన్ వ్యూస్ సాధించిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది ‘రాధే’. మరోవైపు ‘రాధే’ విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళ రాకర్స్, టెలిగ్రామ్‌లలో హెచ్‌డి క్వాలిటీలో లీక్ అయ్యింది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే పైరసీకి నో చెప్పాలంటూ సల్మాన్ స్పెషల్ వీడియో విడుదల చేసినప్పటికీ పైరసీ కష్టాలు తప్పలేదు ‘రాధే’ టీంకు.