కాంగ్రెస్ చివరి అస్త్రం ప్రయోగించబోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం క్రమంగా అన్ని రాష్ట్రాలపై పడింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ సైతం ఛాలెంజ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అందరి చూపు ఈ ఎన్నికలపై పడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సైతం పరీక్షలా మారిపోయాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండగా వాటిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవశ్యకత ఆ పార్టీకి ఉంది. ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓడినా ఆపార్టీపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను సైతం మార్చే సాహసం చేస్తుంది. ఇక కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలని నిర్ధారించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ను రాజకీయ విశ్లేషకులు చూస్తుంటారు. దీనికి తగట్టుగానే అన్ని పార్టీలు ఇక్కడ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఉత్తరప్రదేశ్ లో జరిగిన గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. దీంతో అందరి చూపు ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. బీజేపీ అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీకి ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తన బ్రహ్మస్త్రంగా చెప్పుకుంటున్న ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలుపుతోంది. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తాజాగా ఆమె సారథ్యంలో కాంగ్రెస్ భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ప్రతిజ్ఙా యాత్ర పేరుతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్లు తిరగనున్నారు. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆరంభం కానుందని సమాచారం. ఈ యాత్ర పేరుతో ప్రియాంకా గాంధీ ప్రతీ మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతుందని ఆపార్టీ ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈనేపథ్యంలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కీలకంగా మారయనేది మాత్రం వాస్తవం. ఎన్నో ఆశలతో బరిలో దిగుతున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమేరకు సత్తాచాటుతుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!