మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా పవర్ స్టార్.. పవర్ స్టార్.. సీఎం.. సీఎం అంటూ గోలగోల చేశారు.. దీనిపైనా పవన్ మాట్లాడుతూ.. ‘పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదెందుకు..? మీరు పవర్ స్టార్ అని అరవడంగాని, సీఎం.. సీఎం అనే అరుపుల కోసంగాని నేను ఇక్కడికి రాలేదని పవన్ తెలిపారు.
సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నాని సినిమా ఓటీటీ విడుదల చేస్తుంటే.. అంతా తిట్టారు. థియేటర్లు ఓపెన్ చేయనందుకు వైసీపీ వాళ్ళను అడగండి. మీకు నాకు గొడవలు ఉంటే, నా సినిమాలు ఆపేయండి. ఇండస్ట్రీని, కార్మికులను వదిలేయండి. రాష్ట్రంలోని వైసీపీ నేతలకు పవన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు కల్గిస్తే తాట తీస్తానని పవన్ హెచ్చరించారు. ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్ కాదని, ఇండియన్ రిపబ్లిక్ అని వైసీపీ నేతలకు పవన్ గుర్తు చేసారు. పవన్ కళ్యాణ్ ను బ్యాన్ చేసుకోండి.. సినిమా ఇండస్ట్రీని మాత్రం వదిలేయండి. సినిమా మేం తీస్తే టిక్కెట్లు మీరు అమ్ముతారా..? ఉరుకుంటారనుకోవద్దు.. బయటకు లాగి తంతారు’ అని పవన్ హెచ్చరించారు.