వైరల్: బుల్లెట్ బండి పాటకు వధువు స్టెప్పులు.. వరుడు ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాను తెలంగాణ జానపద పాటలు షేక్ చేస్తున్నాయి.. ఈ మధ్య ఎక్కడకి వెళ్లినా బుల్లెట్ బండి పాట వినిపిస్తోంది.. ప్యాసింజర్ ఆటోల నుంచి టీస్టాల్, దాబా ఇలా ఎక్కడైనా ఆ పాటనే హల్ చల్ చేస్తోంది.. అయితే, తాజాగా ఓ వధువు తన పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఆ పాటకు లయ బద్దంగా కాలు కదుపుతూ చూపరులను ఆకట్టుకుంది.. వధువు స్టెప్పులకు.. ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు.. అయితే వధువు ఏదో ఒక్క స్టెప్పు వేసి ఊరుకోలేదు.. పాట పూర్తిగా అయిపోయేవరకు తన నృత్యంతో ఆకట్టుకుంది.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
కాగా, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా బా’ అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందింది. రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు.. ఎస్కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
Also Read
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?