వైసీపీ పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి: పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. వరదల బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇద్దామంటే.. ప్రజల కోసం ఖర్చు పెడతారనే నమ్మకం లేదని పవన్ ఆరోపించారు.
Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్
Also Read
మరోవైపు వైసీపీ నేతలకు పాదయాత్రలు చేసే అలవాటు ఉందని… విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తే మొదటగా తానే మద్దతు తెలుపుతానని పవన్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే మంగళగిరిలో ఎందుకు దీక్ష చేస్తున్నావని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని…. అయితే వారికి గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణాలర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహనీయుడేనని గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాగే విశాఖలో సభ పెడితే తాడేపల్లిలో ఉంటున్న జగన్‌కు వినబడదని.. అందుకే అమరావతిలో దీక్ష చేపట్టానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?