శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది.
నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎంపీలు సైతం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలంటూ మరోసారి ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.