మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికం అయ్యే సూచనలున్నాయి.
మిథునం : ఈ రోజు ఈ రాశివారి స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పదు. వైద్య రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి.
తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధు వర్గాల నుంచి మాటపడవలసి వస్తుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్థానచలనానికై చేయు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు ఆశాజనకం. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ప్రయాణాలు, కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. బ్యాంకుల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. రావలసిన బకాయిలు, సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరడంతో కొత్త అనుభూతికి లోనవుతారు. నిరుద్యోగులకు నూతన ఆలోచనలు వస్తాయి.