మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా…