ఆ రెండు కులాలకు ఆ నేతలు చెక్ పెడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విచిత్రమయిన రాజకీయం ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రధాన కులాలకు పోటీగా మిగతా కులాల నేతలు ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారు. నాన్ రెడ్డి, నాన్ కమ్మ నేతల ఏకీకరణ ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కాపునేతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆలోచనకు తెర తీస్తే, దానికి మద్దతు పలికారు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అయితే ఇవి వైసీపీకి లబ్ధిచేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఆరోపించారు. కాపులకు రాజ్యాధికారం కావాలన్న కోరికను సవరించుకున్న ఆ సామాజికవర్గం… కమ్మ, రెడ్డియేతర కులాల కూటమి కోసం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
ఈ ప్రయత్నాలకు కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ మద్దతు పలికారు. పల్లకీ మోసే బోయల్లా… అవసరం తీరాక విసిరికొట్టే జాతుల్లా ఇంకా ఉండాలా? కరివేపాకులా తీసేసే ఆ రెండుకులాలకు ధీటుగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరం కలిస్తే ఆ రెండు కులాలను అధికారం నుంచి దూరం చేయలేమా? అంటూ ఆయన ఓ బహిరంగలేఖ రాయడం కలకలం రేపింది. తమ సామాజికవర్గం ఒక్కటే పోరాడితే.. అధికారంలోకి రావడం కష్టమని గుర్తించిన కాపులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమతో పాటు కలుపుకుని కొత్త కూటమి కట్టాలనే సరికొత్త వ్యూహానికి తెరతీశారు. అందుకోసం ఇప్పటికే ప్రాథమిక సమావేశాలు పెట్టిన ఆ వర్గం.. తదుపరి కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలకు ముద్రగడ కూడా అండగా నిలిచారు. ఇప్పటికే గోదావరి జిల్లాల బీసీ నేతలతో భేటీ అయిన ముద్రగడ… హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల అజెండాను బలపరిచారు. ఈ కొత్త కాన్సెప్ట్‌తో.. కొంత మంది నేతలను సంప్రదిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ తో కూడా వీరితో మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత నిస్తేజమైన కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా.. కాపు నేతల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రఘువీరారెడ్డి లాంటి వాళ్లతో కూడా ఈ టీం మాట్లాడుతోందని తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రయత్నాలను కాపు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తప్పుపడుతున్నారు. కులాలకు అతీతంగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఉండగా.. ఈ కొత్త కూటమి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదంతా కాపుల ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేయడానికి చేస్తున్న కుట్రగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతలకు పార్టీ పెట్టి నడిపేంత శక్తి లేదని విమర్శించారు.
అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతుతో పవన్ కల్యాణ్ ను.. బలపరిస్తే కాపులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు హరిరామజోగయ్య. ఈ కొత్త కూటమి ప్రయత్నాలను ఏపీలోని అన్ని పార్టీలు గమనిస్తున్నాయి. ఎంత వరకు ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందనే లెక్కలు వేస్తున్నాయి. అయితే అందులో చేరే నేతలు ఎవరు? ఏ స్థాయి వారు అనేది తేలితే తప్ప.. దానికి ఉనికి ఉంటుందా? పుట్టక ముందే పోతుందా? అనేది అర్ధం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!