ముందు వెయ్యి కోట్లు ఇవ్వండి… ఆ త‌రువాత మాట్లాడుకుందాం…

ఇరాన్‌పై అమెరికా మ‌రోసారి విరుచుకుప‌డింది.  ప‌రిమితికి మించి యూరేనియం నిల్వ‌ల‌ను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది.  ఈ ఆంక్ష‌ల కార‌ణంగా ఇరాన్ వేల‌కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోయింది.  కాగా, ఆంక్ష‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన 10 బిలియన్ డాల‌ర్ల‌ను అమెరికా వెంట‌నే చెల్లించాల‌ని, ఆ త‌రువాతే అణు ఒప్పందంపై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాల‌ని ఇరాన్ పేర్కొన్న‌ది.  2018 నుంచి  ఇరాన్‌పై ఆంక్ష‌లు విధించారు.  అయితే, బైడెన్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇరాన్ స‌ర్కార్ అనేక‌సార్లు ఆంక్ష‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించింది.  అయితే, అణు ఒప్పందంపై ముందు ఇరాన్ స‌ర్కార్ ముందుకు రావాల‌ని చెప్ప‌డంతో ఇరాన్ పైవిధంగా స్పందించింది. 

Read: రోడ్ల దిగ్బంధంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం… 43 రైతు సంఘాల‌కు…

-Advertisement-ముందు వెయ్యి కోట్లు ఇవ్వండి... ఆ త‌రువాత మాట్లాడుకుందాం...

Related Articles

Latest Articles