T-20 World Cup : పైనల్ కు చేరిన న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ గండం నుంచి కివీస్ బయపడినట్లైంది. టీ-20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలుపొంది మొదటి సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో మొయిన్ అలీ, డేవిడ్ మలన్ మినహా బ్యాట్స్‌మెన్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్, ఇష్ సౌదీ, అదమ్ మిల్నేలకు తలో వికెట్టు దక్కింది. లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఔటవగా, మూడో ఓవర్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
అయితే మరో ఓపెనర్ డెరిల్ మిచెల్… కాన్వేతో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. కానీ 14 ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫిలిప్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తర్వాత క్రీజులోకి దిగిన జిమ్మీ నీషమ్ 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో డెరిల్ మిచెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు. 47 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మిచెల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, అదిల్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈ విజయంతో.. ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టైంది. ఇవాళ టీ-20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. దుబాయిలో రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!