ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన…