అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్‌లో తొలి హిట్ మూవీ ఇదే.
Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ బిడ్డ
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ రూ.20.91 కోట్ల బిజినెస్ చేయగా… ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లకు రూ.2.75 కోట్ల లాభాలు వచ్చాయి. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలోని పాటలన్నీ ప్రేక్షకాదారణ పొందాయి. ముఖ్యంగా సిధ్ శ్రీరామ్ ఆలపించిన లెహరాయి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసి మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.