ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 160 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉండటంతో వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీనిపై ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సన్లు మొదటితరం కరోనాను అడ్డుకోవడానికి తయారు చేసినవే. దీంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు అడ్డుకట్ట వేస్తాయి అన్నది తెలియాల్సి ఉంది.
Read: విశాఖలో వింత జాతర… బురదనీళ్లు చల్లుకుంటూ…
ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు త్వరలోనే వ్యాక్సిన్‌ను తీసుకురాబోతున్నట్టు మోడెర్నా ఫార్మా తెలియజేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు కట్టడి చేస్తాయో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఒకవేళ కొత్త వ్యాక్సిన్‌ను తయారు చేయాల్సి వస్తే 2022 వరకు సిద్ధం చేస్తామని మోడెర్నా సంస్థ తెలిపింది. మోడెర్నా వ్యాక్సిన్లు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని, త్వరగా కొత్త వ్యాక్సిన్లను తయారు చేయగలమని మోడెర్నా సంస్థ స్పష్టం చేసింది.