NTV Telugu Site icon

Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..

Sridhar Babu

Sridhar Babu

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీఎం.. మానవీయ కోణం మర్చిపోయారు అని బాధతో చెప్పారు.. చనిపోయిన సోదరి కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండే అనేది తమ ఆలోచన అని అన్నారు. అలాగే.. చిన్న అబ్బాయిని బతికించాలి అనేది తమ తాపత్రయం అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ల గురించి మాట్లాడారు సీఎం.. ఇండస్ట్రీ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా అనేది ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రోడ్ షో చేశారా లేదా అనేది వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Revanth Reddy: అన్ని మతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమైన యాక్సిడెంట్ అని అన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే.. ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదన్నారు. యాక్సిడెంట్ జరిగినందుకు నేను ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి గంట గంటకు వివరాలు తెలుసుకుంటున్నానని తెలిపారు. మరోవైపు.. తాను బాధ్యత లేకుండా థియేటర్‌కి వెళ్లాను.. పర్మిషన్ లేకుండా వెళ్లానని అంటున్నారు.. అది ఖచ్చితంగా తప్పుడు సమాచారం అని అన్నారు. థియేటర్ వాళ్లు పర్మిషన్ విషయంలో క్లారిటీ తెచ్చుకున్నారని తెలియడంతోనే అక్కడికి వెళ్లానని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులే దారి క్లియర్ చేస్తున్నారు.. పోలీసుల డైరెక్షన్లోనే తాను వెళుతున్నాను అంతా క్లియర్ అయిపోయింది అని అనుకున్నానని తెలిపారు.

Maharashtra: మంత్రులకు శాఖలు కేటాయింపు.. షిండేకు మళ్లీ నిరాశ

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం తన వ్యక్తిత్వ హననం అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని అంటూనే తన గురించి చాలా తప్పుడు ప్రచారం, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు.. కాబట్టి తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని, ఏ డిపార్ట్మెంట్ ని బ్లేమ్ చేయడం లేదని తెలిపారు. అలాగే తాను ఏ పొలిటికల్ లీడర్ ని.. అలాగే గవర్నమెంట్ ని కూడా బ్లేమ్ చేయడం లేదని పేర్కొన్నారు. నిజానికి గవర్నమెంట్ తమతో చాలా బాగుందని ఎందుకంటే తమకు థియేటర్లకు మంచి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వంతో తమకు అంతా బానే ఉందని చెప్పుకొచ్చారు. తాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేను ఇలా బిహేవ్ చేశాను అంటూ ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జు్న్ అన్నారు.