అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద సంధ్య థియేటర్ అంశం మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్కి రాకూడదని సంధ్య థియేటర్ కి లిఖితపూర్వకంగా పోలీసులు సమాచారం ఇచ్చినా హీరో వచ్చాడని రావడమే కాదు రోడ్ షో చేస్తూ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించాడని �
రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు..
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జ�