కేంద్ర మంత్రిపై రాహుల్ నిప్పులు.. అజయ్ మిశ్రా ఓ క్రిమినల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఖేరీ ఘటన పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది.. ఆ ఘటనపై చర్చించాలంటూ పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో ఎగువ, దిగువ సభలు మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డాయి. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ సిట్ దర్యాప్తులో వెల్లడికావడంపై పార్లమెంట్లో చర్చ సాగించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి.. లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చించాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. ఇటు రాజ్యసభలో తృణమూల్ ఎంపి సుస్మితా దేవ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఇవాళ లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అంటూ నిప్పులు చెరిగారు.
Read Also: అమ్మాయిల వివాహ వయస్సుపై కేంద్రం సంచలన నిర్ణయం..!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఇక, లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి అజయ్ మిశ్రానే నిందితుడని.. వెంటనే అతడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ… లఖింపూర్‌లో జరిగిన హింసాకాండలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించిన రాహుల్.. మంత్రి కుట్ర పన్ని రైతుల్ని చంపేశారని ఫైర్ అయ్యారు.. రైతుల్ని చంపిన మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరో వైపు ప్రతిపక్షాల సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి… వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు ఎంపీ.. ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు.. దీంతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!