డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్‌ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో నిర్వహిస్తున్న పార్టీపై ఎన్‌సిబి ఆకస్మిక దాడి చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనపై విచారణ జరుగుతోంది. అయితే డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ హస్తం లేకపోవచ్చని అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.

Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?

ఆర్యన్ ఖాన్ షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ల మొదటి బిడ్డ. ఈ జంటకు ఆర్యన్ తో పాటు సుహానా ఖాన్ అనే కుమార్తె, అబ్రామ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. 2019 లో ఆర్యన్ ఖాన్ ‘ది లయన్ కింగ్’ హిందీ వెర్షన్‌ను డబ్ చేశారు. అతను సింబా పాత్రకు గాత్రదానం చేశాడు. సుహానా ఖాన్ సినిమాల్లోని వచ్చే అవకాశం ఉంది. కానీ ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇంకా క్లారిటీ లేదు.

-Advertisement-డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

Related Articles

Latest Articles