ఓ వ్యక్తిని వరించిన అదృష్టం.. బ్యాంకు ఖాతాలో రూ.కోటి డిపాజిట్.. కానీ అంతలోనే…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలోని నార్‌ఫోక్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. దీంతో అతడి బ్యాంకు ఖాతాలో అనుకోకుండా రూ.1.09 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఈ డబ్బును ఏం చేయాలో తెలియక సదరు వ్యక్తి ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే ఆ తర్వాత అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం పదండి.
Read Also: నమ్మలేని నిజం… దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
యూకేకు చెందిన రస్సెల్ అలెగ్జాండర్ అనే వ్యక్తికి చెందిన బ్యాంకు అకౌంట్‌లో పలు దఫాలుగా రూ.1.09 కోట్లు డిపాజిట్ అయ్యాయి. తొలిసారి అంటే 2020, డిసెంబర్ 29న రూ.30వేలు డిపాజిట్ కాగా అతడికి అనుమానం వచ్చింది. దీంతో బ్యాంకుకు కాల్ చేయగా.. స్పందన రాలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దీంతో మళ్లీ బ్యాంకును సంప్రదించాడు. ఈ సారి బ్యాంకు ఉద్యోగి స్పందిచి… డిపాజిట్ అయిన డబ్బు వారసత్వంగా వచ్చిందని.. ఆ డబ్బును అతడు ఉంచుకోవచ్చని బ్యాంకు ప్రతినిధులు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ డబ్బు చట్టబద్ధమైనదే అని అలెగ్జాండర్ నమ్మాడు. ఆ నిధులకు మరిన్ని డబ్బులు కలిపి రూ.2.36 కోట్లను వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే అలెగ్జాండర్‌కు ఈ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు.
దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మురిగిన సామెత తరహాలో అలెగ్జాండర్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ అయిన 9 నెలల తర్వాత బ్యాంకు కళ్లు తెరిచింది. డిపాజిట్ చేసిన సొమ్ము అతడిది కాదని గుర్తించింది. దీంతో డిపాజిట్ చేసిన రూ.1.09 కోట్లను వడ్డీ (అదనంగా రూ.6వేలు)తో కలిపి చెల్లించాలని బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. పొరపాటున వేరే వ్యక్తికి చెల్లించాల్సిన సొమ్మును అలెగ్జాండర్‌కు బదిలీ చేశామని బ్యాంకు వెల్లడించింది. దీంతో అలెగ్జాండర్‌కు షాక్ తగిలింది. ఉన్నట్టుండి రూ.కోటి చెల్లించాలంటే ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. అసలు ఈ డబ్బే లేకుంటే తాను ఇల్లు కొనుగోలు చేసేవాడిని కాదని గగ్గోలు పెట్టుకున్నాడు. తన భవిష్యత్ ప్రణాళికలను బ్యాంకు దెబ్బతీసిందని ఆవేదన చెందాడు. తాను బ్యాంకు ప్రతినిధులతో సంప్రదించిన తర్వాతే డిపాజిట్ అయిన డబ్బును ఖర్చు చేశానని.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటని మొరపెట్టుకున్నాడు. చివరకు ఆ ఇల్లు అమ్మేసి బ్యాంకుకు చెల్లించాల్సిన నగదు ఇచ్చేశాడు. అయితే బ్యాంకు తనకు క్షమాపణ చెప్పాలని, నష్టపరిహారం చెల్లించాలని అలెగ్జాండర్ డిమాండ్ చేశాడు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!