Kolkata Metro: నీటి అడుగున ట్రయల్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా మెట్రో కొత్త మైలురాయిని సాధించింది. దేశంలో మొదటిసారిగా హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం ద్వారా కోల్‌కతా మెట్రో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. నది కింద మెట్రో రేక్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కోల్‌కతా మెట్రోకు చెందిన సీనియర్ అధికారులు, ఎంపిక చేసిన ఇంజనీర్లు మాత్రమే ట్రయల్ రన్ సమయంలో అందులో ప్రయాణించారు. హౌరా నుండి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం పొడవు సుమారు 4.8 కి.మీ. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది. సొరంగం నీటి ఉపరితల మట్టం కింద 32 మీటర్లు ఉంది.
Also Read:Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కీలక మలుపు..
నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ మార్గంలో సాధారణ నీటి అడుగున ట్రయల్ రన్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మహాకరణ్ స్టేషన్ నుండి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ప్రయాణించిన మొదటి ట్రయల్ రన్‌లో ఆయన ఉన్నారు. ఈ మార్గంలో వచ్చే ఏడు నెలల పాటు రెగ్యులర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ తరువాత, సాధారణ ప్రజలకు సాధారణ సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అనేక అడ్డంకులను అధిగమించి హుగ్లీ నది క్రింద రేక్‌లను నడపడంలో తాము విజయం సాధించామన్నారు. ఇది మెట్రో రైల్వేకు చారిత్రాత్మక క్షణం అని పేర్కొన్నారు. కోల్‌కతా, నగర శివారు ప్రాంతాల ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించడంలో ఇది విప్లవాత్మకమైన చర్య అని తెలిపారు. బెంగాల్ ప్రజలకు భారతీయ రైల్వేలు అందించిన ప్రత్యేక నూతన సంవత్సర కానుక ఇది అని పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
Kolkata Metro creates History!For the first time in India,a Metro rake ran under any river today!Regular trial runs from #HowrahMaidan to #Esplanade will start very soon. Shri P Uday Kumar Reddy,General Manager has described this run as a historic moment for the city of #Kolkata. pic.twitter.com/sA4Kqdvf0v
— Metro Rail Kolkata (@metrorailwaykol) April 12, 2023
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!