త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్‌లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
కోల్‌కతా మెట్రో కొత్త మైలురాయిని సాధించింది. దేశంలో మొదటిసారిగా హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం ద్వారా కోల్‌కతా మెట్రో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. నది కింద మెట్రో రేక్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
Kolkata Metro Runs Under River, First In India: కోల్‌కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్‌కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు…