నేటి నుంచి బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు.. అవి ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి.. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు 15 నుంచి 17 రూపాయలకు, ఆర్థికేతర లావాదేవీలపై 56 రూపాయలకు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్‌ఛేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. నగదు జమ వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి 150 రూపాయల రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. 25 వేల వరకూ 150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు 20 రూపాయలు చెల్లించాలి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్.. ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్బీఐ తెలిపింది.ఇది నేటి నుంచి అమలు కానుంది..దీంతో సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజునాడూ బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇక, ఇవాళ్టి నుంచి డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇంటివద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు 20 రూపాయలకు పైగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే డోర్‌స్టెప్ సేవల్లో ఐపీపీబీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లినప్పుడు లావాదేవీలపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని వెల్లడించింది. సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలు పెంచుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ధరలను సవరిస్తుంటారు. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరగడంతో… ఇవాళ గ్యాస్ ధరలను కూడా పెంచే అవకాశముంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు