అక్కడ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వుంటేనే ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటక ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వణికిపోతోంది. కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు.
బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ వుంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతిస్తారు. ఆర్‌టీ పీసీఆర్ రిపోర్ట్ వుంటేనే విమానాశ్రయాల్లోకి ఎంట్రీ వుంటుంది. వీటితో పాటు కోవిడ్ ప్రోటోకాల్స్ కఠినతరం చేసింది. కర్నాటక రెవిన్యూ మంత్రి ఆర్ అశోక ఈ మేరకు ప్రకటన చేశారు.
Also Read
ఒమిక్రాన్ వేరియంట్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలపై ఫోకస్ పెట్టామన్నారు. సినిమా హాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో ఫిజికల్ క్లాస్‌లు నిర్వహించేవారు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు డోస్‌లు వ్యాక్సిన్ వేయించుకున్నవారు మాత్రమే వీటిలోకి అనుమతిస్తారు. 18 ఏళ్ళు దాటినవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. కాలేజీలు, స్కూళ్లలో జనం గుమిగూడడంపై నిషేధం విధించారు. పెళ్ళిళ్ళకు భారీగా జనాన్ని సమీకరించడంపై ఆంక్షలు వున్నాయన్నారు మంత్రి అశోక.
బెంగళూరులో ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు గుర్తించిన వారిలో ఒకరి నుంచి మరో ఐదుగురు ప్రాథమిక కాంటాక్ట్ లకు కూడా వైరస్ సోకింది. ఈ ఐదుగురూ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆంక్షలు విధించింది. కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. అసలే ఓమిక్రాన్ వైరస్ గతంలో వచ్చిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్లూహెచ్ వో హెచ్చరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెంచింది. రెండుడోస్‌లు తీసుకోనివారు వెంటనే రెండవ డోస్ తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!