మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. పనిలోపనిగా తిట్ల పురాణం అందుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
తాజాగా, మంత్రి కేఎస్ ఈశ్వరప్పను పనికిమాలిన దద్దమ్మ అంటూ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మండిపడితే.. దీనిపై ఘాటుగా స్పందించిన ఆయన.. కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యను పచ్చితాగుబోతుగా పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు తాగుతాడో తాగిన మత్తులో ఏం మాట్లాడుతారో తెలియదని వ్యాఖ్యానించారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌ను ఉగ్రవాది అంటూ ఆరోపించిన సిద్దరామయ్య.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలవి తిట్లు కానప్పుడు తనవి మాత్రం ఎలా? అవుతాయని ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇక, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ రూపొందించారంటూ మాజీ ఎంపీ అనిల్ లాడ్ చేసిన వ్యాఖ్యలకు కూడా దుమారాన్నే రేపాయి.. వెంటనే అనిల్ లాడ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాదు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్‌ను ఉగ్రవాదిగా సంబోధించినందుకు సిద్దరామయ్యపై కూడా కంప్లైంట్ చేశారు. ఇలా కర్ణాటకలోనూ నేతల మధ్య తిట్ల దండకం కొనసాగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..