రాజకీయ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కాస్తా శృతిమించి తిట్ల పురాణానికి దారితీస్తున్నాయి.. కొందరు నేతలైతే ఏకంగా రాయడానికి ఇబ్బందిగా ఉండే బూతులు తేలికగా మాట్లాడేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ నేత నోరు తెర్చినా.. బూతులు, సవాళ్లకు కొదవలేకుండా పోయింది. ఇక, ఎన్నికలు వస్తే చాలు.. నేతల బూతులతో టీవీలు మార్మోగుతున్నాయి. అయితే, ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమా అంటే పొరపాటే.. కర్ణాటకలో విధాన పరిషత్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రధాన…
ఎన్నికల్లో గెలిస్తే ఆ కిక్కే వేరు. గెలిచిన వారి సంబరాలకు.. సంతోషాలకు హద్దే ఉండదు. చేతి చమురు వదిలించుకున్నాక.. ఆ ఎన్నికలు రద్దయితే..? మింగలేక… కక్కలేక ఇబ్బంది పడతారు నాయకులు. ఏపీలో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన వారి పరిస్థితి అలాగే ఉందట. భవిష్యత్ ఏంటో తెలియక తలపట్టుకున్నట్టు సమాచారం. తదుపరి వ్యూహం ఏంటో తెలియడం లేదట ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారట. ఎన్నికలు పూర్తయినా.. నిబంధనల…
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ఈసీ నీలం సాహ్ని సమాలోచనలు చేస్తుంది. ఈ తీర్పు పై అప్పీల్ కి వెళ్లే అంశం పై న్యాయ నిపుణులు తో చర్చిస్తున్నారు ఎస్ఈసీ. ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఎస్ఈసీ నీలం సాహ్ని. ఎన్నికలు రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పు వివరాలను ఎస్ఈసీకి వివరించింది ఎస్ఈసీ కార్యాలయం. నిబంధనలు మేరకే ఎన్నికలు నిర్వహించామంటున్న ఎస్ఈసీ……
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో…