కరోనా సమయంలో నగరాల్లో ఉన్న జనాభా చాలా వరకు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొంతమంది వ్యవసాయం, పశుపోషణపై దృష్టిసారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పశుపోషణ గత కొంతకాలంగా వేగంగా పెరుగుతున్నది. పశువుల పెంపకం లాభసాటిగా మారడంతో ఆ దిశగా యువత దృష్టిసారించింది. పశుపెంపకంలో వినూత్న విధానాలను అవలంభిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.
Read: కుప్పంపై బాబు ఫోకస్.. ఏ క్షణమైనా వస్తానని సంకేతాలు
ఇందులో భాగంగా అంతరించిపోయే దశలో ఉన్న హళ్లికార్ జాతి గిత్తల పెంపకం కర్ణాటక రాష్ట్రంలో పెరిగింది. ఈ జాతి గిత్తలకు ఇటీవల కాలంలో గిరాకి ఏర్పడింది. సాధారణంగా మేలుజాతి గిత్తలు 7 నుంచి 12 లక్షల వరకు పలుకుతుంటాయి. అయితే, హళ్లికార్ జాతిలో మేలురకం గిత్తలు ఒక్కొక్కటి కోటి రూపాయల వరకు ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
Read: లక్షల మంది ప్రాణాలు కాపాడిన కోతులు… అవే లేకుంటే…
ఈ జాతి ఆవు పాలల్లో ఆరోగ్యాన్ని రక్షించే ఏ2 ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఈ ఆవుపాలను మెడిసిన్ రంగంలో ఎక్కువగా వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకారు, ఈ జాతి గిత్తల వీర్యం ఒక్కో డోసు ఖరీదు రూ.1000 వరకు ఉంటుందట. ఈ జాతి గిత్తల వీర్యాన్ని నైట్రోజన్ కంటైనర్లలో వందల ఏళ్ల వరకు భద్రపరచవచ్చని అందుకే ఆ జాతి ఆవులు, గిత్తలు ఖరీదైనవని నిపుణులు పేర్కొన్నారు.