12-17 ఏళ్లవారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. డీసీజీఐ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా ఫార్మా దిగ్గజమైన జాన్సన్ అండ్ జాన్సన్.. ఇప్పటికే భారత్‌లో ఈ సంస్థ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది.. తాజాగా ఆ సంస్థ 12 నుంచి 17 ఏళ్ల వయస్సు పిల్లల కోసం తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం లభించింది. కౌమారదశ పిల్లలకు కొవిడ్ -19 కి వ్యతిరేకంగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ.. గతంలో దరఖాస్తు చేసుకోగా.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ మూడవదశలో కోవిడ్ పై 85 శాతం సామర్ధ్యం పనిచేస్తోందని తేలపడంతో.. ఈ నిర్ణయం తీసుఉఒంది డీసీజీఐ.
ఇక, ఈ సింగ్ డోస్ వ్యాక్సిన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కొవిడ్ -19 వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్అండ్ జాన్సన్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.. 18 సంవత్సరాల వయస్సు లోపు వారికి కోవిడ్ ను నివారించడానికి భారత ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ -19 సింగిల్-డోస్ టీకా అత్యవసర వినియోగ అధికారాన్ని జారీ చేసినందుకు మేం సంతోషిస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేశారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!