ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన జీవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వివాదాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్యలో మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా ఇతరులను కూడా అన్యాపదేశంగా ఎన్నికల ముగ్గులోకి లాగుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ వేడుకలో ఎన్‌టిఆర్‌ని కలిసినపుడు మా లో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారని, ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసారని జీవిత తెలిపారు.
Read Also : ‘వేధింపులు’ అంటూ సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్
Also Read
ఇక మంచు విష్ణు లైవ్ షోలో ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారన్నాడు. దీంతో జీవిత తను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తను ఎన్టీఆర్ నిరాసక్తత గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తుందని అంగీకరించారు. ఎన్టీఆర్ కాజువల్ గా చర్చించిన విషయాలను తను మీడిమా ముందు వెల్లడించటం సమస్యగా మారిందని జీవిత అంగీకరించారు. మా లో నెలకొని ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారని, తనని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు తను ఏమీ చెప్పలేదన్న సంగతిని వివరించారు జీవిత.
తాజావార్తలు
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!