మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘మా’ అధ్యక్ష పదవికి త్రికోణ పోటీ జరుగనుందా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి జరగబోయే “మా” ఎన్నికలలో పోటీదారుల పేర్లను ప్రకటించకముందే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా ఫైర్ బ్రాండ్ నటి జీవిత కూడా మా’ అధ్యక్ష పదవి కోసం పోటీగా రంగంలోకి దిగుతున్నారని టాక్.
Read Also : ఆకట్టుకుంటున్న “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ర్యాప్ సాంగ్
ప్రస్తుతం జీవిత ‘మా’ సెక్రెటరీగా ఉన్నారు. తన పనితీరుతో ఆమె “మా” సభ్యుల మన్నన పొందారు. అయితే అధ్యక్ష పదవిలో ఉంటే తాను ఇంకా ఎక్కువగా మా సభ్యులకు సేవ చెయ్యగలనని ఆమె భావిస్తున్నారట. ఇప్పటికే ఆ ప్రయత్నంగా ఆమె అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ నటులే ‘మా’ అధ్యక్షులుగా పోటీ చేశారు, పదవి కూడా చేపట్టారు. తాజా వార్తల ప్రకారం మొదటిసారి ఒక నటీమణి ‘మా’ ప్రెసిడెంట్ గా పోటీపడితే ఈ సారి ఎన్నికలు చాలా వేడివాడిగా మారనున్నాయి.