జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి. జేఈఈ ఫలితాలను ఐఐటి ఖరగ్‌పూర్ విడుదల చేసింది. అర్హత సాధించిన విద్యార్థులకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 27 వ తేదీన మొదటి రౌండ్ సీట్లను కేటాయిస్తారు. మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 30 లోగా ఆనైల్‌లో రిపోర్ట్ చేయాలి. ఇక నవంబర్ 1వ తేదీన రెండో రౌండ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్ 6 వ తేదీన మూడో రౌండ్, నవంబర్ 10 వ తేదీన నాలుగో రౌండ్, నవంబర్ 14 వ తేదీన ఐదో రౌండ్, నవంబర్ 18 వ తేదీన ఆరోవ రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు మొత్తం 1,41,699 మంది విద్యార్థులు హాజరుకాగా, 41,862 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మృదుల్ అగర్వాల్‌కు జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్ రాగా, బాలికల విభాగంలో కావ్య చోప్రాకు మొదటి ర్యాంక్ వచ్చింది.
Read: కోలుకున్న సాయిధరమ్ తేజ్: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్