గాంధీ జయంతి రోజున జనసేన పార్టీ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. శ్రమదానం కార్యక్రమం తరువాత భారీ మహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో సభను రాజమండ్రిలోని వేరే ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని అన్నారు. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ అని, రాజకీయం నాకు సరదా కాదని, అది బాధ్యత అని అన్నారు. తనని తిడితే భయపడతానని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని, అది చాలా తప్పు అని అన్నారు. గుంతలు నేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉన్నదా అని ప్రశ్నించారు. రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీదే విజయం అని చెప్పారు. ఒకే కులాన్ని వర్గ శతృవుగా చూడడం సరికాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read: రివ్యూ : ఇదే మా కథ