NTV Telugu Site icon

Wayanad: గర్భంతో ఉన్న ఏనుగును చంపిన కిరాతకులు.. వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా?

Wayanad (2)

Wayanad (2)

కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. నాలుగేళ్ళ క్రితం ఆహారం కోసం చూస్తున్న గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాల కలిపిన ఫైనాపిల్ ను పెట్టారు. దాన్ని తింటున్న క్రమంలో పేలడంతో తీవ్రమైన నొప్పితో చనిపోయింది. ఇప్పుడు అ ఏనుగుకు ఫైనాపిల్ పెట్టిన గ్రామనే ప్రకృతి కోపానికి బలి అయ్యిందని ప్రచారం జోరుగా సోషియాల్ మిడియాలో సాగుతోంది. అసలు ఏనుగుల శాపనే ఆ గ్రామాల్లోని ప్రజల చావుకు కారణమైందా? జరుగుతూన్న ప్రచారం వాస్తవం ఎంత అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం.

READ MORE: District Collectors Conference: సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం.. పదేళ్లలో ఇదే తొలిసారి..

అసలేం జరిగింది..?
నాలుగేళ్ల క్రితం మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నది పాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్‌ ఆశచూపారు. అయితే ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది తెలియక ఎనుగు ఆశగా ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన ఫైనాపిల్ పండును తీసుకొని నోట పెట్టింది. నోట్లు పెట్టిన వెంటనే ఆ పండు భారీ శబ్దంతో పేలింది. ఒక్కసారిగా పెలుడు తీవ్రతకు ఆ మూగజీవి నోటివెంట రక్తం తీవ్రంగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడిచేయలేదు. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది.

READ MORE:Vijay Deverakonda Movie: రెండు భాగాలుగా విజయ్‌ సినిమా.. ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉడిపోయంది. అయితే ఎనుగు పేలుడు పదార్థం తినిందనే విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్‌, నీలకంఠన్‌ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి నదిలో దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ.. గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. బలవంతగా మరో రెండు ఎనుగులతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే 2020 మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు బయటకొచ్చిన ఎనుగు చనిపోయిందని అధికారులు గుర్తించారు. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను అప్పట్లో మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు.

READ MORE: Vijay Deverakonda Movie: రెండు భాగాలుగా విజయ్‌ సినిమా.. ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అయితే అలా చనిపోయిన ఎనుగుల శాపం వల్లే వయనాడ్ ఘటనకు కారణం అని కేరళ, ఏపీ, తెలంగాణా సహా అన్ని రాష్ట్రాల్లోని యువత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏనుగును చంపిన గ్రామంలోనే వరదలు వచ్చాయాని… అక్కడి ప్రజలందరూ చనిపోయారని… ఈ విలయానికి కారణం ప్రకృతి సైతం దేవుళ్ళుగా భావించే గజరాజును ఆ గ్రామా ప్రజలు చంపడమే అంటూ ఎవరికి నచ్చినట్లు వారు రాసుకోస్తున్నారు.. అయితే అలాంటి వాదనలను కోట్టిపారేస్తున్నారు మరికొందరు నెటిజెన్లు. అసలు ఏనుగు ఘటన జరిగింది మల్లపురం జిల్లాలో అని…. వరదలు వచ్చింది వయనాడ్ జిల్లాలో అని రెండిటికీ సంబంధ లేదని అయినా నాలుగేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇప్పుడు జరిగిన విషాదానికి లింక్ పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE:US Recession : అమెరికాపై మాంద్యం నీడ.. ప్రమాదంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ఏనుగు చంపిన వ్యక్తిని అరెస్టు చేశారని కాని అ గ్రామానికి…ఇప్పుడు ఘటన జరిగిన గ్రామాలకు సంబంధం లేదని.. ఇంకా ఈ గ్రామంలో నలుగుర్ని కాపాడింది ఓ గజరాజు అంటూ చెప్పుకోస్తున్నారు. ఇలా వాయనాడ్ విషాదం పైన అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేయడం బాధకరం అంటున్నారు . ఏది ఏమైన ఏనుగుని చంపడం దారుణమైన ఘటన…..ఇప్పుడు వయనాడ్ విలయం మరింత విషాదాన్ని నింపిన ఘటన..ఇలాంటి సమయంలో సమన్వయంతో వ్యవహరించకుండా ఇలా సోషియాల్ మిడియాలో చర్చలు జరగడంపై తప్పుపడుతున్నారు మరికొందరు.