జులై 30న వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో సంభవించిన కొండచరియలు భారీ వినాశనానికి కారణమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 300 మందికి పైగా మరణించారు.
కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా. తప్పిపోయిన వారిని అన్వేషించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.