రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బిజినెస్ లో దూసుకుపోతున్నారు.. ఆయన కూమార్తె ఇషా అంబానీ కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా వరుస బిజినెస్ లను చేస్తూ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.. ఒక అంబానీ కూతురు గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రానిస్తూ సక్సెస్ ఫుల్ ఉమేన్ గా పేరు తెచ్చుకుంది.. ఇటీవల హీరోయిన్ అలియా భట్ బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ ను సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఒక్క బిజినెస్ ఉమెన్ గా మాత్రమే కాదు ఫ్యాషన్ ఐకాన్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సింగ్, ఔరా అనిపించేలా ఖరీదైన నగలను దరిస్తూ జనాలను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్న ఇషా.. తన లేటెస్ట్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. తాజాగా ఇషా ధరించిన ఓ నెక్లేష్ ధర నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.. ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి..
ఈ నెక్లేష్ ధర ఎంతో అని ఖచ్చితంగా తెలియనప్పటికి నిపుణుల వివరాల ప్రకారం దీని ధర 20 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం రూ.165 కోట్లు..ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్‌లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్‌లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో ఉన్న డ్రెస్సును ధరించింది.. ఆ ఈవెంట్ కు నిషా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..