Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Is Another Cm Kcr Meeting In Huzurabad

హుజూరాబాద్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ..?

Published Date :October 10, 2021 , 7:47 pm
By Manohar
హుజూరాబాద్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్‌ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు వీస్తాయా..లేదంటే అభివృద్ధికి పట్టం కడతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. నిన్నటి ఇప్పడి వరకు నియోజకవర్గం ప్రజలు బీజేపీ, టీఆర్‌ఎస్ హంగామా మాత్రమే చూశారు. ఇక నుంచి కాంగ్రెస్‌ ప్రచార హోరు కూడా చూడనున్నారు. అంతేనా , ఈ ప్రధాన పార్టీలతో పాటు బరిలో నిలిచిన నిరుద్యోగ అభ్యర్థులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా హల్చల్‌ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా ఓటరు క్లారిటీ ఓటరుకు ఉంటుంది. అయితే, నిబంధనల పుణ్యామా అని రాజకీయ పార్టీలకు జనం ముందు తమ సత్తా చూపించుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే కేసీఆర్‌ ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది.

హుజూరాబద్‌ ప్రచారంలో కేసీఆర్‌ బదులు కేటీఆర్‌ ప్రచారం చేస్తారని టాక్‌. ఇప్పటి వరకు హుజూరాబాద్‌ ప్రచార భారం అంతా హరీష్‌ రావు తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్‌ తోడుకానున్నారు.మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు , సీనియర్‌ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిలో ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి ..గ్రామస్థాయిలో ఎలా డీల్‌ చేయాలనే దానిపై స్పష్టంగా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇంటింటికి వెళ్లి తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలపై వివరించాలని పార్టీ క్యాడర్‌ని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది.

ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసినా భారీ బహిరంగ సభ ఒక్కటయినా ఉండాలి. లేకపోతే ఓటరు ఏదో వెలితిగా ఫీలవుతాడు.ఎలక్షన్‌ ఓల్టేజీ కూడా పెరగదు. అలాగే, జనం మూడ్‌ కూడా భారీ బహిరంగ సభల ద్వారా తెలిసే అవకాశం వుంది. కానీ కోవిడ్‌ నిబంధల వల్ల రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. పరిమిత సంఖ్యలో ర్యాలీలు..సభలకు మాత్రమే పర్మిషన్‌ ఉంది. ఈసీ నిబంధనల ప్రకారం ప్రచార సభలకు వేయి మందికి మించి జనం రాకూడదు. అయినా కేసీఆర్‌ కనీసం ఒక్క భారీ బహిరంగ సభ అయినా పెట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ దీని మీద ఎన్నికల సంఘానికి ఓ విజ్ఞాపన పత్రం సమర్పించింది. దానిని ఇంకా ఆమెదించలేదు. హుజూరాబాద్‌లో ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టు ఉన్న పరిస్థితిలో కేసీఆర్‌ ఒక్క బహిరంగ సభతో మొత్తం సీన్‌ మారిపోతుందని..గెలుపు తథ్యమని గులాబీ దళం బలంగా నమ్ముతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయింది. కోవిడ్‌ 19 పూర్తిగా నియంత్రణలో ఉన్నందున సభకు సడలింపు ఇవ్వాలని గులాబీ పార్టీ ఈసీని కోరింది. ఒక వేళ అది సాధ్యం కాకపోతే మీటింగ్‌ని వేరే చోటికి మార్చాలన్నది వ్యూహం. కరీంనగర్, హుస్నాబాద్, హన్మకొండలను పరిశీలిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నారు. పార్టీ సమావేశాలు నిర్వహించకుండా ఈసీ ఆపలేకపోతున్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.

మరోవైపు, ప్రధాన గ్రామాల్లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ల ద్వారా వర్చువల్ మీటింగులు పెట్టాలని కొందరు నాయకులు సూచించినట్టు సమాచారం. దీనిని పార్టీ వర్గాలు కొట్టి పారేయటం లేదు. కానీ కేసీఆర్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు సమాచారం. మరోవైపు, టీఆర్ఎస్ ఎత్తుగడలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. ఒక వేళ నియోజకవర్గం వెలుపల టిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే తామూ అలాంటి వ్యూహమే రచిస్తామని కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ అలా చేస్తే జాతీయ నాయకులను రంగంలో దించే అవకాశం ఉంది. అమితాషా వంటి టాప్‌ లీడర్స్ ఈ ప్రచార సభలో పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మీటింగ్‌కు అనుమితి ఇస్తుందా ..లేదా అన్నది వేచి చూడాల్సి వుంది.

మరోవైపు కాంగ్రెస్‌ కూడా వేగం పెంచింది. లేట్‌ గా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్టు హస్తం పార్టీ ప్రచారంలో దూకుతోంది. 20 మందితో కూడిన ప్రచార బృందం జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ తో పాటు పలువురు రాష్ట్ర నేతలు ఉన్నారు. అయితే అజారుద్దీన్, అనసూయ వంటి స్టార్‌ క్యాంపెయినర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM KCR‌
  • cm kcr meeting
  • huzurabad
  • Huzurabad by-election
  • telangana

తాజావార్తలు

  • Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..

  • IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions