జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. దసరా నాడు ప్రకటించనుండడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు గులాబీ బాస్.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో కమిటీతో సమావేశం కానున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై కమిటీతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అంటే రెండు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమాల రూపకల్పన కోసం రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు…
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఒకలా చెబితే… ఇక్కడ బండి సంజయ్ మరోలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను జైలుకు పంపుంతా అన్న బండి సంజయ్ నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు ఏంటో తెలుస్తుంది అని…
హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు…