US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్
- గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- నిబంధనలను దుర్వినియోగం చేశాయని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ సహా పలు దిగ్గజ సంస్థలను విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కల్పించే ప్రక్రియలో ఉపయోగించే కార్యక్రమం నుంచి అమెరికా కార్మిక శాఖ సస్పెండ్ చేసింది. ఈ కంపెనీలు నిబంధనలను దుర్వినియోగం చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నట్లు అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ తెలిపారు. అయితే, ఈ చర్యలపై సంబంధిత కంపెనీల నుంచి పూర్తి వివరణలు ఇంకా వెలువడలేదు.
Also Read
- Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
అసలు PERM ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలనుకునే యజమానులకు Permanent Labour Certification Program (PERM) కీలకమైన ప్రక్రియ. ఒక ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని నిర్దిష్ట నిబంధనల ప్రకారం నిర్ధారించిన తర్వాత, విదేశీ ఉద్యోగి కోసం శాశ్వత కార్మిక ధ్రువీకరణ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ దృష్టి సారించింది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో అమెరికా కార్మికుల అవకాశాలు, వేతనాలపై ప్రభావం పడకుండా చూడాలన్నది తమ చర్యల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్‌పై అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసిన సంస్థల్లో మైక్రోసాఫ్ట్‌ను మించిన కంపెనీ లేదని ఆరోపించారు. అయితే ఇవి అధికారుల ఆరోపణలు మాత్రమే. దర్యాప్తుల తుది ఫలితాలు, సంబంధిత సంస్థల వివరణలు వెలువడిన తర్వాతే ఈ ఆరోపణలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మైక్రోసాఫ్ట్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. 2025లో ఆ సంస్థ సుమారు 6,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించిందని, అదే సమయంలో అర్హులైన అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని ధ్రువీకరించి 6,000కు పైగా H-1B వీసాలకు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా ఉద్యోగులను తొలగించిన కొన్ని ఉద్యోగాలకే సంబంధించి దాదాపు 1,000 PERM దరఖాస్తులు దాఖలయ్యాయని వాన్స్ ఆరోపించారు. H-1B వీసా విధానం ఉద్దేశం అమెరికాలో అందుబాటులో లేని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించడమేనని చెప్పారు. అయితే ఈ విధానంలో అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు.
ఐటీ కంపెనీలకే కాకుండా తొమ్మిది విశ్వవిద్యాలయాలపైనా అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ జాబితాలో హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులను తీసుకురావడం ద్వారా అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించే ప్రయత్నం చేశాయన్న ఆరోపణలపై ఈ సంస్థలను విచారించనున్నట్లు సోండర్లింగ్ పేర్కొన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో తెలిపారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!