ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మాట బాగా వినిపిస్తోంది. అనేక రంగాల్లోకి క్రిప్టో కరెన్సీ ప్రవేశించింది. కార్ల కొనుగోలు నుంచి షాపింగ్ వరకు క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నారు. అయితే, మనదేశంలో క్రిప్టో కరెన్సీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రైవేట్ ఎక్సేంజీలపై నిషేదం విధించింది. క్రిప్టో కరెన్సీ ఎవరి నియంత్రణలో ఉండవు కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయడం కష్టంతో కూడుకున్నది. ఇక క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురాబోతున్నది. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు.
Read: లైవ్: ఏపీని వీడని వానగండం…
ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందే భారత్‌లోకి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ ప్రవేశించింది. కాయిన్ స్టోర్ పేరుతో బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కాయిన్ స్టో మొదట వంద మంది ఉద్యోగులను తీసుకోబుతున్నట్టు తెలియజేసింది. రెండు కోట్ల డాలర్లను పబ్లిసిటీ కోసం వినియోగించబోతున్నట్టు కాయిన్ స్టోర్ ప్రకటించింది. క్రిప్టో కరెన్సీ బిజినెస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం సానుకూల విధానాలను తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది సింగపూర్‌కు చెందిన ఈ కాయిన్ స్టోర్ ఎక్సేంజ్.