ఢిల్లీలో ఆర్ ఫ్యాక్టర్ 2కి చేరింది. దీంతో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇప్పుడు అది 2 కి చేరడంతో వ్యాప్తి భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రులను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఆక్సీజన్ సిలీండర్లను స్టోర్ చేసుకోవాలని లేఖ రాసింది. మూడో వేవ్ సూచనలు కనిపిస్తుండటంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
Read: యానంలో మళ్లీ నైట్ కర్ఫ్యూ అమలు…
ఇక యూపీలో కరోనా కేసుల పెరుగుదలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. సోమ, మంగళ వారాల్లో ఈ మాక్ డ్రిల్‌పై రివ్యూ చేయనున్నారు. కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉన్నప్పటికీ, వైరస్ వీక్‌గా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని యూపీ సర్కార్ ప్రజలకు భరోసా ఇచ్చింది. ఇండియాలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు వంటి వాటిపై నిషేధం అమలు చేస్తున్నారు. కేసుల పెరుగుదలను బట్టి వైరస్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.