టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు టీమిండియా ఖాతా తెరిచింది. బుధవారం రాత్రి అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వరుసగా మూడోసారి భారత కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
Read Also: దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్ ముందు భారీ లక్ష్యం
ఓపెనర్లు రోహిత్ శర్మ(74), కేఎల్ రాహుల్(69) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని వీరు అందించారు. టీ20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. కాగా లక్ష్యఛేదనకు దిగిన అఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కరీం జనత్ (42), కెప్టెన్ నబీ (35) మాత్రమే టీమిండియా బౌలర్లను కాసేపు కాచుకున్నారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా… బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ తీశారు.