భారత్‌లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గి.. 20 వేలకు దిగువకు పడిపోయిన ఊరట కలిగిస్తున్న సమయంలో.. మరోసారి భారీగా పెరిగాయి కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి 20 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 311 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఇక, ఇదే సమయంలో 28,718 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,37,39,980కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,30,14,898 పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,48,062కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,34,306 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 88,34,70,578 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు తెలిపింది.