ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 16,862 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది. ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,03,678 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 379 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైనమొత్తం కరోనా మరణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 30,26,483 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 97,14,38,553 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.