ప్రభాస్ బ్యానర్లో రామ్ చరణ్ సినిమా…

ఆర్ఆర్ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  ఒక‌వైపు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్ర‌క‌టించారు.  ప్ర‌భాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేష‌న్స్ సంస్థ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్న‌ట్టు అధికారికంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.  యూవీ క్రియేష‌న్స్‌, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.  ఈ చిత్రానికి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  మ‌ళ్లీరావా, జ‌ర్సీ వంటి హిట్ చిత్రాల‌కు గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ సినిమా ఎప్ప‌టి నుంచి సెట్స్ మీద‌కు వెళ్తుంది, మిగ‌తా యూనిట్ కు సంబంధించిన విష‌యాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.  

Read: దేవ‌ర‌గ‌ట్టు క‌ర్ర‌ల స‌మ‌రం: భారీ బందోబ‌స్తు…

-Advertisement-ప్రభాస్ బ్యానర్లో రామ్ చరణ్ సినిమా...

Related Articles

Latest Articles