మంత్రి బొత్స కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు.

ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి.. ప్రజా ప్రతినిధి కాళ్లు మొక్కుతారా ? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి కాళ్లపై పడిపోవడం యావత్ పాలనా వ్యవస్థకే అవమానకరం. జిల్లా పాలనా యంత్రాంగం అంతా మంత్రి చెప్పుచేతల్లో ఉందనడాన్నిఈ సంఘటన ప్రతిబింబించడం లేదా? ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? దీన్ని ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించాల్సిన అవసరం లేదా? అత్యున్నత పాలనా వ్యవస్థకు చెందిన పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.

తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?